సాయంత్రం ఆరో గంట కొట్టడానికి ఇంకా ఆరు నిమిషాల టైం ఉంది… పొలో మని నా బ్యాగ్ వీపుకేస్కుని, “నే తగ్గనంటే తగ్గా!!” అనుకుంటూ వెయిట్ తగ్గించుకుందామని అయిరోబిక్స్ కి వెళ్ళా… వెళ్ళేసరికే క్లాస్ start అయిపోయి, ఒక పావు గంట అయిపోయింది… ఈ 6+15 నిముషాలు ఎం చేసానో ప్రస్తుతం అప్రస్తుతం అని గ్రహించాలి…
వెళ్ళి.. జన జీవన శ్రవంతి లో కలిసిపోయే ఉగ్రవాదిలా నేను కూడా ఈ జన జీవన శ్రవంతి లో వాళ్ళందరూ కార్చే చమటల్లో తెప్ప వేసుకుని ఈది మరీ కలిసిపోయాను…
ఆ సమయములో.. మా ట్రైనర్ “Are ya warm??”అని అడిగారు…warm up అయితే కానీ.. exercise లొ మునిగి తేలలేము కదా…”Yeah…!! I am hot..!!” అని చెప్దాం అనుకున్నా.. అప్పుడైనా A/C పెంచి… temperature తగ్గిస్తారేమో అని… ప్చ్..!! లాభం లేకపోయింది…మళ్ళీ ఎక్కువ ఆలోచించే scope ఇవ్వకుండా… అశ్వద్ధామ హతః కుంజరః టైప్ లో “Yeah…!! I am…” అని సెలవిచ్చాను…
సంప్రదాయ సంగీతం… అదే.. కర్ణాటక సంగీతం నేర్చుకునేదాన్ని… ఒక ఎం.ఎస్. సుబ్బు లక్ష్మి, ఒక సుధా రఘునాథన్, ఒక వాణి జయరాం లాంటి వాళ్ళ కోవకు చెందాలనుకుని…
నిరంతరము నిద్రాహారాలు మానకుండా, ప్రాక్టీస్ కూడా మానేసి కలలు కంటూ పోషించాను నా దేహాన్ని… అటువంటి సంగీతం ఇవాళ ఎయిరోబిక్స్ కి ఇంతగా ఉపయోగపడడం బహు ఆనందదాయకం.. అదెలా అంటే.. లయ ఙ్ఞానం అనమాట…!! గమనించారో లేదో.. ఎవరయినా పాట పాడితే మనము కాళ్ళతో చిన్నగా తాళం వేస్తూ ఉంటాము… అలాగే.. బంచిక్కు (ఎయిరోబిక్స్ ని తెలుగులో బంచిక్ అంటారు) క్లాస్ లో వచ్చే మ్యూజిక్కుకి ఆ చిన్నగా వేసేది ఒక పది…ఇరవై ఇంతలు చేసి వెయ్యాలనమాట..!! దాన్ని ఒక స్టెప్పు అంటారు…
ఒకరు చతురస్రం లో స్టెప్పులు వేస్తే.. ఒకరు తిశ్రంలో వేస్తారు… మరొకరు ఖండ జాతి లో వేసి… mood ని, mode ని ఖండ ఖండాలుగా విభజిస్తారు… హాస్యం అయినా, లాస్యం అయినా లయ బద్ధంగా ఉండాలి అని చిన్నప్పుడు మా తెలుగు టీచర్ నాజ్మ బేగం చెప్పేవారు… అంచేత… మా ట్రైనర్ వైపు ఒక లుక్ ఇచ్చి…”ఏంటి సార్ ఇది..?? ఎవరికిష్టమైన పటలకు వాళ్ళు స్టెప్పులేస్తున్నారు…?? ఒకరు ‘ఆ అంటే అమలాపురం కి ” ఇంకొకరు ‘ఏ ఊరే చినదానా కి ‘, మరొకరు ‘చెన్నై చంద్రమా..మనసే చేజారె కి ‘.. వేరొకరు ‘ఇది ఒక మరో లోకం…’ కి ఇలా రక రకాల సాంగులకి స్టెప్పులేస్టున్నారు…!! అందర్నీ కలిసి..’బంచిక్ బం బం చెయ్యి బాగా…’ కి వెయ్యమనండి సార్…” అని చెవులకు వినపడకుండా కళ్ళతో చెప్పా.. ఆయన బుర్రతో అలోచించి… నోటి తో.. ” Okay… step left..” అని చేతిని యెడమవైపుకి చూపించారు… అదేదో reset బటన్ నొక్కినట్టు అందరూ లెఫ్టు కి స్టెప్పు వేసారు…
తరువాత బరువులు ఎత్తిస్తారు… అక్కడికొచ్చే జనాలు, సంవత్సరానికి ఒక సారి…హైదరాబాదు నుంచి నిజామాబాదు కి ఒక్కరోజు కోసం వెళ్ళడానికి సర్దుకున్న బ్యాగ్ ని కూడా కూలీలచేత మొయించేవారిలో మొట్టమొదటి జాతి కి చెందినవారు… బైసెప్స్, ట్రైసెప్స్, ఈ-సెప్స్, ఆ-సెప్స్ అని.. అసలు.. మన ఒంట్లో కొన్ని ప్రదేశాలు ఏవేవున్నాయో… ఎలా ఉపయోగ పడతాయో కూడా తెలియని మూలల్లో ఉండే muscles(కండరాలు) ని కదిపి..కుదిపి.. కరిగించేలా కృషి చేయిస్తారు…
అప్పుడనిపిస్తుంటుంది.. ఎవడ్రా అసలు.. కృషీవలుడు అంటే రైతు అని చెప్పింది..?? అసలు క్రుషీవలుడు అంటే.. ఎయిరోబిక్స్ కి వచ్చిన సాఫ్త్ వేర్ ఇంజినీరు అని, అలా అని నిఘంటువు తిరగత్రిప్పి వ్రాయాలని పిటిషన్ పెట్టడానికి decided… ఈ decision making కి.. అదే decision-making పోజ్ లో అంటే… పైకి ఒక 45 డిగ్రీస్ ఆంగిల్ లో ఒక 30డిగ్రీస్ సైడ్ కి చూస్తూ… కళ్ళ ముందే కందిరీగ గుఇన్న్ గుఇన్న్ మని సౌండ్ చెస్తున్నా కళ్ళు రెప్పలు వెయ్యకుండా, మాకు తెలుగు నేర్పించిన మా ఆ నాజ్మా బేగం మ్యాడం ని గుర్తుచేస్కుంటూ ఒక నిట్టూర్పు విడుద్దామనే క్షణం లో… “Hey Sirisha…!! Where are ya…? Be in this world and DO” అన్నారు మా ట్రైనర్…
“Yaaaahhh… ” అని ‘ఈ’ లోకం లోకి వచ్చేసి… చిన్నప్పట్నుంచే బరువులు బాధ్యతలు మోయడం అలవాటైన నేను.. తాత్కాలికమయిన ఈ dumbbells ని ఎత్తి-దించి-ఎత్తి-దించి-ఎత్తి-దించి…ఇలా ఒక ఇరవై సార్లు చదవండి… అక్కడికి వెయిట్
ట్రైనింగ్ పూర్తవుతుంది…
యెడారిలో అరిగిపోయిన బాటా చెప్పులు వేస్కున్న యోగి వేమన శిష్యుడు “గాలి వాన లో వాన నీటిలో పడవ ప్రయాణం” అని ఆరిపోయిన గొంతు తో అసందర్భ గేయాలు పాడుకుంటూ ఫినాయిల్ ఐనా దొరికితే వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుని తాగుదాము అని decide చేసుకున్నవాడికి… ఒక రెండు స్టాల్స్ – కోక్ అండ్ పెప్సి కనిపిస్తే… ఎవడి దగ్గరకు వెళ్ళాలో తెలియని తికమకలో ఇటు అటు ఇటు అటు ఇటు అటు చూసీ చూసీ కళ్ళు తిరిగి పడి పోయే time కి గోళీ సోడా వాడు నీళ్ళు తాగిస్తే కలిగే స్ఫూర్తి కలుగుతుంది…ఎందుకంటే… వెయిట్ ట్రైనింగ్ తరువాత… పడుకొని చేసే వ్యాయామాలు…
“Lie down on your back and hug your knees” అని ట్రైనర్ ఇచ్చిన పిలుపుతో అందరూ వారి వారి ముణుకులను గట్టిగా కౌగిలించుకుని.. ఒక ఎ.ఆర్.రెహమాన్ ‘duet’ వేసుకుని… సిద్ధపడతారు…
అయినా నా పిచ్చి కాకపోతే…!! పడుక్కొనిచ్చి చేయమన్నా, పరుగెత్తి పాలు తాగమన్నా.. ఎయిరోబిక్స్ లో అంతా శ్రమ చేయించాలనే ముఖ్యోద్దేసమే కదా… సో… ఈ వ్యాయామాలు మరింత తీవ్రంగా ఉంటాయి… గాలిలో ఒక రాడ్ ఉందనుకుని దాని మీద హాయిగా కాలు చాపుకో… పెళ్ళయిన కొత్త జంట వారి పెద్దవారికి పాదనమస్కారం చేస్తున్నట్టు.. కుడి చేత్తో నీ పాదాలను తాకు… అని.. ఇలా మనల్ని ఒక విభిన్న ప్రపంచానికి తీసుకువెళ్ళి చేయిస్తారు.. దీనిపేరే ABS…
తరువాత పిచుకలుకు వాటి రెక్కల్లో దురద వేస్తె వాటి ముక్కులతో గోక్కోడానికి ఎలా వంగుతాయో…సైడ్ కి.. అలా చేయించడానికి పిచుకల్లో పరకాయ ప్రవేశం చేయిస్తారు… దీని పేరే సైడ్ క్రంచెస్… ఇలా పలు విధాలుగా కాయ కష్టం చేసిన తరువాత… ఎప్పుడెప్పుడు “Lets catch up tomorrow” అనే నాలుగు ఇంగ్లీషు ముక్కలు మా ట్రైనర్ నోట్లోంచి వస్తాయా అని జనాలంతా ఈగలు ముసురుతున్నా నోరు తెరుచుకుని… దూరంగా అలికిడి విని చెవులు నిక్కపొడుచుకున్న కుక్క లాగా… బ్రతుకు జీవుడా అని పడిపోయే కళ్ళను పెద్దవిగా చేసి మరీ అందరూ ఆయన మూతి వైపే చూస్తుంటారు…
బాల సుబ్రహ్మణ్యం పాడితే చెవిలో అమృతం చుక్కలు పడినట్టుంటుంది అని అనిపించిన వాడికి ఎలా ఉంటుందో తెలియదు కానీ… ఆ నాలుగు ముక్కలు విన్న సాఫ్త్ వేర్ ఎయిరోబిక్స్ డూ-అర్ కి మాత్రం అమృతాన్ని తేనెలో కలిపి ఒక అర కిలో పంచదార లో పాకం పట్టి, దాంట్లో బెల్లం వేసి… ఒక లేహ్యం తయారు చేసి దాని పైన జీడిపప్పు…బాదాం పప్పు..పిస్తా పప్పు అతికించి…కిస్స్ మిస్సులతో మిస్సులకి ఇచ్చినంత సంబరంగా ఉంటుంది…
హయ్యో రామా..!! ఇంతా ఎయిరోబిక్స్ చేసిన తరువాత ఇటువంటి లేహ్యాన్ని తింటే…ఇంక ఒళ్ళు తగ్గినట్టె…!!
God Bless Me…!!!
- శిరీష.





Sirisha…post baagundhi. I visualized the entire scene and started laughing to it. I like your way of narrating the story with a tinge of naughtiness which we hardly find in the now-a days girls blogs. Keep them coming.
hey V…!! thanks man… i know, you would sure visualize, it’s all about girls especially, when it comes to aerobics…
When i read this story i am not much inpresses. You can improve this particular story. I feel bore when i read it. Sorry formy comments.
Siri, you’re excellent ! pichikala polika , hahahaha. I kept on laughing for that creative comparision. You’ve great expressive writing style. You guys at golisoda rock !
hey seetha…!! thanks tons babes…
pichuka anna pichuka lehyam anna mari navvalsinde…!!
yep… we guys rock at golisoda…!!
waiting for your next post babes…
గాలిలో ఒక రాడ్ ఉందనుకుని దాని మీద హాయిగా కాలు చాపుకో
idi excelelnt chiriii….rod undanukodam daka ok…haaiga kaallu chapukunte appudu untundi asalaina roddu…inkaa ah naagma begum telugu teacher ah ohahahahhaha
for obvious reasons… really gud one…enjoyed!!
goda painundi aerobic centre loki thongi chustunna anubhuthi kaligindi!
chirii…pichukala badulu kakulu pettalsindii..
hey kittu…!!
evaro pokiri chustunnaduu ani…
thanks ra..:) goda painundi ala aerobic center loki chuste, Nasser ki complain chestaru…
hi Naga Prasad,
Thanks for stopping at our blog. hope you liked it.
good that you are promoting telugu even inscience…
మీ బ్లాగు ఇంతకు మునుపు చూశానా? చూసిన గుర్తు లేదు.
ఏమైనా, బ్రిలియంట్ గా రాశారు. ఏరోబిక్స్ ని నిజంగా బంచికు అంటారా??
Hi Kottapali,
Mee pen name kudaa creative ga undi…
thanks for reading on…!!
krottha padalu srustimpa badali ante, manalanti vare evaro okaru aa pani cheyyali kada…!!
అక్కడికొచ్చే జనాలు, సంవత్సరానికి ఒక సారి…హైదరాబాదు నుంచి నిజామాబాదు కి ఒక్కరోజు కోసం వెళ్ళడానికి సర్దుకున్న బ్యాగ్ ని కూడా కూలీలచేత మొయించేవారిలో మొట్టమొదటి జాతి..
heyy..nijamga ee madhya kaalamlo ilanti vaallani chaala mandini nenu chusa..aina OOhaha!! bhale vunnayle polikalu..naakithe ramya krishna song kalla mundukochesindi….ha ha ha..!!
hey hey bindu.E…
nice to see your comment girlie…:)
thanks lots…!!
//ఫినాయిల్ ఐనా దొరికితే వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుని తాగుదాము
//జన జీవన శ్రవంతి లో వాళ్ళందరూ కార్చే చమటల్లో తెప్ప వేసుకుని ఈది మరీ కలిసిపోయాను…
– ఈ రెండు గీతాలు (Lines) కొత్త ప్రయోగంలా బాగ్గునాయి
Thanks Rama rama @ RaviKanth…
hope you liked the post…
baga raasaaru…nice
Hey Thanks niru…
keep in touch with golisoda. more of them coming…