ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మా పనిమనిషి నాకు కింద మెసేజ్ ఇచ్చింది.
“సార్, మీకు మీ అమ్మమ్మగారు ఫొన్ చేస్తే ఏదో సినిమా పాట వస్తూ ఉందంట. సినిమాలో ఉన్నారనుకొని కట్ చేసి ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేసారు. మీ తాతగారు చాలా సీరియస్‌గా ఉన్నారంట…” అని చెప్పింది.

ఆ మాట విన్న నేను ఇంకేమీ అలోచించకుండా వెంటనే సికంద్రాబాద్ రైల్వే్‌స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాను కూకట్‌పల్లీ నుంచీ పరిగెత్తుకుంటూ. (ఆటో ఎక్కచ్చుగా అనే లాజిక్ చెప్పే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. మన్మధుడు మూవీలో క్లైమాక్స్ సాంగ్ చెలియా చెలియా లో కూడా నాగార్జునగారు కార్ ఉండి కూడా పరిగెత్తుకుంటూ, ఎద్దుల బండి ఎక్కి, నడుస్తూ చాలా ఫాస్ట్‌గా చేరుకున్నారు కాబట్టి అదే ఫార్ములా అప్లై చేసాను).
అలా ఒక 10 మినట్స్‌లో స్టేషన్ చేరుకుని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను.

జెనరల్ టికెట్  ఒకటి నెల్లూరుకి ఇవ్వు బాబూ అనగానే టికెట్ కౌంటర్ నుంచి ఆయన “నువ్వు ఫ్రెషర్‌వా లేక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్రొఫెషనలా” అని అడిగాడు.
నాకు ఐ.టీ ఇండస్ట్రీలో 4 ఇయర్స్ ఎక్ష్‌పీరియన్స్ ఉందండీ పైగా నేను మా కంపెనీలో మేనేజర్‌ని అన్నాను చంటి సినిమాలో వెంకటేష్‌లా అమాయకంగా…
దానికి ఆయన “ఈ ఐ.టీ వాళ్ళకీ, అందులో మేనేజర్‌లకీ అంతకంటే తెలివి ఎక్కడుంటుందిలే. జెనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణానికి నువ్వు ఫ్రెషర్‌వా లేక చాలా సార్లు వెళ్ళావా?” అని అడిగాడు.

నేను దానికి “ఫ్రెషర్ అండీ” అనగానే ఆయన “నెల్లూరు కి టికెట్ 150 రూపీస్ అండ్ నీకు జెనరల్ కంపార్ట్‌మెంట్ ఎక్కి సీట్ పట్టుకోవటానికి ఒక 3 అవర్స్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్‌కి 250 రూపీస్” అని చెప్పి నేను ఇచ్చిన 500 రుపీస్‌కి ఛేంజ్ కింద 100 రుపీస్ ఇచ్చారు.

వెంటనే ఇద్దరు పెద్ద మీసాలున్న వాళ్ళు వచ్చి నన్ను స్కూల్‌లో మొదటి రోజు జాయిన్ అయ్యే పిల్లాడిని ఈడ్చుకొని వెళ్ళినట్టు రూం నం: 1 కి ఈడ్చుకొని వెళ్ళి వదిలారు. వెళ్ళగానే అక్కడ ఒక ఫ్యాకల్టీ ఇలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. “నా పేరు పట్టాల శేషాద్రి. నాకు జెనరల్ కంపార్ట్‌మెంట్ ఎక్కటంలో 20 ఇయర్స్ డొమెయిన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నీ లాంటి హార్మొనియం పెట్టెలు పట్టుకొని వచ్చే ఐ.టీ వాళ్ళకి సుమారుగా వెయ్యి మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇందులో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. షల్ వీ స్టార్ట్?” అని నా రిప్లై కోసం ఎదురు చూడకుండా ఆయనే ఇలా చెప్పాడు.

“ట్రైన్ ప్ల్యాట్‌ఫార్మ్ మీదకు రాగానే జెనరల్ కపార్ట్‌మెంట్స్ ముందు రెండు, వెనక ఒకటి ఉంటుంది. అంటే ఒక్కొక్క కపార్ట్‌మెంట్‌కి 72 సీట్స్ చొప్పున టోటల్‌గా 72 X 3 = 105 సీట్స్ ఉంటాయి అన్నారు.”comp3
“అదేంటి సార్, 105 అంటున్నారు, 72 X 3 = 216 కదా” అని అప్ప్రైసల్ టైంలో రేటింగ్ ఇచ్చే మేనేజర్ మీద వచ్చే కోపంతో అడిగాను.
అందుకు మా ఫ్యాకల్టీ పట్టాల శేషాద్రి “పిచ్చివాడా అది ఫ్రెషర్స్ ఇచ్చే ఆన్సర్ నాయనా. రియల్ టైంలో మొత్తం 105 సీట్సే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సీట్ల మీద వాంతులు చేసుకొని ఉంటారు, ఇంకొన్ని సీట్ల మీద నిద్ర పోతూ ఉంటారు, ఇంకొన్ని సీట్స్ మీద ఘుట్ఖా ఊసి ఉంటారు, ఇంకొన్ని సీట్ల మీద నుంచి సీట్ పీకేసి ఇంట్లో సోఫా కింద వాడుకోవటానికి పట్టుకొని పోయి ఉంటారు నాయనా. సో, మొత్తం మూడు కపార్ట్‌మెంట్స్‌కి 105 సీట్సే ఉంటాయి.”

“ట్రైన్ ప్ల్యాట్‌ఫార్మ్ మీదకు రాగానే ఈ 105 సీట్స్ కోసం ఒక 11,528.5 మంది కాంపిటీషన్‌లోకి వస్తారు. వీళ్ళలో ఒక 50 మంది మెరిట్ స్టూడెంట్స్ నాయనా. వీళ్ళకు ఎలాంటి ట్రైన్‌లో అయినా జెనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీట్ ఈసీగా దొరుకుతుంది. అన్నట్టు, నువ్వు వాడే మొబైల్,  దాని ఓ.ఎస్ ఏంటి నాయనా?”
నేను: “సోనీ ఎక్స్పీరియా సార్. ఓ.ఎస్ ఏమో ఆండ్రాయిడ్ అండీ” అన్నాను.
మళ్ళీ పీ.ఎస్ గారు: “అది నాయనా… పైన చెప్పిన 50 మంది మెరిట్ స్టూడెంట్స్ నోకియా వాడుతారు విండోస్ ప్ల్యాట్‌ఫార్మ్ మీద. సో వీళ్ళూ ప్ల్యాట్‌ఫార్మ్ మీదకు ట్రైన్ రాగానే విండో నుంచే జెనరల్ కంపార్ట్‌మెంట్‌లోకి దూరి సీట్లు పట్టేసుకుంటారు. మిగతా 50 సీట్లకు గానూ 11,478 మెంబర్స్ పోటీ పడతారు. నీలాంటి ఫ్రెషర్‌కి రైల్లో సీట్ సంగతి పక్కన పెడితే, రైలు ఎక్కే ఛాన్స్ కూడా దొరకదు.

దీనికి మనం టిప్ నం: 1 వాడాలి. నువ్వు ఈ రెండు గుండు సూదులతో ఇంజను వైపు పరిగెత్తుకొని వెళ్ళి, ఇంజను టైర్లని పంక్చర్ చెయ్యాలి. ఇంక ట్రైన్ కదలదు కాబట్టీ ఆ టైంలో సగం మంది ట్రైన్ నుంచీ దిగుతారు. ఆ టైంలో నువ్వు ట్రైన్ లోపలికి దూకొచ్చు. అక్కడ ఇస్త్రీ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడి దగ్గర ఒక మెనూ కార్డ్ ఉంటుంది. అది చదవకుండా సీదా లోపలికి వెళ్ళు”.
ఇలా మా గురువుగారు చెప్పే టైంలో ఓక పిల్లాడు వచ్చి : “డాడీ, డాడీ నేను ఎందుకు ఇలా నల్లగా, లావుగా, అసహ్యంగా పుట్టానో చెప్పు” అని పీ.ఎస్ వైపుకి తిరిగాడు.
అందుకు పీ.ఎస్ గారు: “నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ట్రైన్ ఎక్కటానికి టిప్ నం:1 యూస్ చేద్దామని చెప్పి రెండు గుండు సూదులతో ఇంజను వైపుకి వెళ్ళి దాని టైర్లను పంక్చర్ చేసాను. అప్పటికీ స్పీడ్‌గా వెళ్తున్న ఆ రైలు వెంటనే స్లో అయ్యి పట్టాల మీద ఉన్న పందికి ఒక 3 సె.మీ దూరంలో ఆగిపోయింది. వెంటనే ఆ పంది: సచ్చి నీ కడుపున పుడతా అని నా వైపు తిరిగి, చెప్పి వెళ్ళిపోయింది. అలా నువ్వు పుట్టావురా బాబూ” అని చెప్పి నా వైపుకి తిరిగి చూపిస్తూ “ఇక్కడో శవానికి ట్రైన్ ఎక్కటం నెర్పించాలి. నువ్వు టీ.వీ లొ ముమైత్ ఖాన్ భక్తి గీతాలు చూసుకో” అని కొడుకుని పంపించేసాడు.

“ఇంక స్టేజ్ 2 లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతీ రైలులో వాష్ బేసిన్ పక్కన ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్ళకి ఒక సీట్ రిసర్వ్ చేసి ఉంటారు. ఈ సీట్ కోసం మనం ట్రై చెయొచ్చు. ఈ సీట్ కొట్టేయ్యటానికి నా దగ్గర కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. రైలు ఎక్కగానే లాసృ కంపార్ట్‌మెంట్ దగ్గరికి వెళ్ళి గార్డ్ దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకొని వచ్చేసేయ్. రైలు మధ్యలో నడికుడి జంక్షన్‌లో మీల్స్‌కి ఆపుతారు. ఆ టైంలో ఇంజను ముందు భాగంలో ఎక్కి ఇంజనుకి ఉన్న లైటును పీకేసేయ్. తరువాత రైల్ స్టార్ట్ అయ్యే టైంకి నీ దగ్గరున్న టార్చ్ లటుతో పట్టాల మీద రైలుకి దారి చూపిస్తూ పరిగెట్టు. డ్రైవర్ స్పీడ్ పెంచి నిన్ను గుద్దితే నీకు ఆ జెనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ సీట్ దొరికినట్టే. ఎలా ఉంది ఐడియా?”
ఈ మాటలు విన్న నాకు మా ఆఫీస్ కెఫెటెరియాలో ఫుడ్ కోర్ట్ వాడు ఒక పైనాపిల్ ముక్కని బ్లూ కలర్‌లో చూపించి ఇదే సాంబార్ ఇడ్లీ అని చెప్పి 50 రుపీస్ తీసుకున్నప్పుడు వచ్చినంత కోపం వచ్చింది. కానీ మా ఫ్యాకల్టీ నాకు రియాక్షన్ టైంకి 0.000000000002 మిల్లీ సెకెండ్స్ మాత్రమే ఇస్తారు. ఆ టైంకి రియాక్ట్ కాలేమని ఫిక్స్ అయిపోయి అలా చూస్తూ ఉండి పోయాను.

పట్టాల శేషాద్రిగారు అందుకొని “అదేనయ్యా ఈ ఫ్రెషర్స్‌తో ప్రాబ్లం. ఇలాంటి ట్రిక్స్ ఉన్నాయని లైఫ్‌లో ఊహించి ఉండవు కదూ… సరేలే, ఇంకో ట్రిక్ చెబుతా విను. ప్రతీ సంవత్సరం నువ్వు మార్చ్ లో టాక్స్ తప్పించుకోవడానికి ఎల్.ఐ.సీ పాలసీ ఎలా కొంటావో, చందన బ్రదర్స్ వాళ్ళు సేల్ పెట్టిన టైంలో ఒక చీర కొనుక్కో. జెనరల్లో ఎక్కాలనుకున్నప్పుడు మీ వీధిలో కుక్కలు ఇంకా నిద్ర లేవని టైంలో ఆ చీర కట్టుకొని ఆటోలో వచ్చి ప్లాట్‌ఫారంకి దగ్గరగా దిగు. దొరికితే లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో సీట్, లేదంటే జెనరల్ కంపార్ట్‌మెంట్‌కి వెళ్తే కూడా ఎవరో ఒక జెంట్ వెధవ లేచి సీట్ ఇస్తాడు. మళ్ళీ, వాట్ ఎన్ ఐడియా.. అనకు.”
ఈ మాటలకి నాకు రాత్రంతా ఆఫీస్‌లో కూర్చొని సివియారిటీ 1 సాల్వ్ చేసి మార్నింగ్ 10 ఓ క్లాక్‌కి ఇంటికి వెళ్ళే టైంలో డెలివరీ మేనేజర్ టీం మీటింగ్ కి మ్యాండేటరీగా అటెండ్ అవ్వండి అన్నట్టు అనిపించి ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్టైంది. తిరిగి చూసే లోపల పట్టాల శేషాద్రిగారు కనిపించలేదు.
ఎదురుగా, ఒకాయన మాత్రం జ్యాకెట్ వేసుకుంటూ కనిపించారు. జూం చేసి చూస్తే మా గురువుగారు పట్టాల శేషాద్రిగారు నన్ను గమనించకుండా “ఇలా వేసుకొని చీర కట్టుకొని కుక్కలకు కనిపించకుండా…” అంటూ ఇందాక చెప్పిన థియరీ క్లాస్‌ని ప్రాక్టికల్‌గా చూపించబోయారు.

ఆ సీన్‌ని చూస్తే జుర్రాసిక్ పార్క్‌ని 3డీ లో చూసినటు ఒళ్ళంతా గగుర్పొడుచుకొని వచ్చింది.
ఇంతలో టింగ్ టింగ్ టింగ్ అని గంట కొట్టారు.
పట్టాల శేషాద్రి గారు “నా క్లాస్ అయిపోయింది. ఇంక జెనరల్ కంపార్ట్‌మెంట్ నుంచీ నెల్లూరు వచ్చే టైంలో ఎలా దిగాలో జంక్షన్‌ జగన్నాధంగారు చెబుతారు” అని చెప్పి ఆ జ్యాకెట్ ముక్క మీద ప్యాంట్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
జంక్షన్ జగన్నాధంగారు “హలో” అని చెప్పగానే కొంచెం ఫ్రెండ్లీ ఫ్యాకల్టీగా కనిపించారు.

తిరిగి హెలో సార్ అని చెప్పే టైంలో జె.జె గారికి ఒక కాల్ వచ్చింది. సడన్‌గా జె.జె గారు అరుంధతిలో సోనూ సూద్‌లా అరవటం స్టార్ట్ చేసారు. “ఏరా, లాస్ట్ బ్యాచ్‌లో మొత్తం సిలబస్ కవర్ చేసినా కూడా నువ్వు జెనరల్ కంపార్ట్‌మెంట్ నుంచీ కిందకు దిగలేదా? అయినా, క్లాస్‌లో ఒక్క డౌట్ కూడా అడగకుండా కుక్క మొహం వేసుకొని కూర్చున్నావు. మీ ఇంట్లో వాళ్ళేమో మా కొడుకు ప్రయోజకుడు అవుతాడు… జెనరల్ కంపార్ట్‌మెంట్ నుంచీ కిందకు దిగుతాడు అని 250 రుపీస్ ఫీస్ కూడా కట్టారు. నీ జంక్షన్ పగిలి పోద్ది. నెక్స్ట్ టైం ఇదే ట్రైన్‌లో కనిపిస్తే మాత్రం నిన్ను విజయవాడకి వెన్యుజెలా కి మధ్యలో వింధ్య పర్వతం పైన రైలు చైను లాగి మెదక్‌లో ఉన్న అరేబియన్ సీ లోకి తోసేస్తా. ఫోన్ పెట్టేయ్… ఆయ్…” అని చెప్పి నా వైపుకి తిరిగాడు.

జె.జె గారు: జెనరల్ కంపార్ట్‌మెంట్‌లోంచీ కిందకు దిగటం అంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడే టైంలో కాలువల్లో పడ్డ బాల్‌ని తీసినంత ఈజీ కాదు బాబూ. దీనికి కొన్ని పద్దతులు, compartment1సంప్రదాయాలు పాటించాలి.
నేను: సార్, నేను మీ ఎక్స్పీరియన్స్ గురించీ తెలుసుకోవచ్చా? (క్వశన్ అడగకపోతే నన్ను ఎక్కడ తోసేస్తాడో అని అడిగాను అని పాఠకులు గమనించగలరు)
జె.జె గారు: “నన్నే ఎక్స్పీరియన్స్ ఎంత అని అడిగే అంత మగాడివారా నువ్వు. నేను జెనరల్ కంపార్ట్‌మెంట్ నుంచీ ఫస్ట్ టైం దిగే టైంలో ఐ.బీ.ఎం, ఇంఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు కూడా పుట్టలేదు. అయినా గాంధీజీ గారిని సౌత్ ఆఫ్రికాలో దింపారు అనుకుంటున్నావా. నేనే ట్రైనింగ్ ఇచ్చా రన్నింగ్ ట్రైన్‌లోంచీ ఎలా దిగాలో. ముందు నేను చెప్పే క్లాస్ వినఆ.. అక్కు పక్షి”.. థూ నా బతుకు. నా భార్య కూడా పెళ్ళి రోజు అప్పుడు నగలు తేకపోయినా ఇలా తిట్టలేదు అనుకుంటూ లెసన్ వినటం స్టార్ట్ చేసాను.
జె.జె గారు: మీ ఊరు ఇంకో అరగంటలో వస్తుంది అనగానే ముందుగా ఈశాన్యానికి 3 మి.మీ జరగాలి. ఇది మన పెద్దవాళ్ళకి మనం పూజ చేసినట్టు అన్నమాట. తరువాత, వెనుకకి ముందుకి ఒక 1సె.మీ కదలాలి. ఇది మీ పేగులు గానీ, ఎముకలు గానీ ఊడిపడ్డాయా అని కన్‌ఫర్మ్ చేసుకోవటానికి. నెక్స్ట్ నీ జేబులోంచీ కంపాస్ తీసి నీ కళ్ళలోనే పొడుచుకోవాలి. పొడుచుకొని “అమ్మా…” అంటూ బిగ్గరగా అరవాలి. ఆ టైంలో అందరూ నీ వైపుకి తిరిగి ఏమైందీ!! అన్నట్టు చూడటానికి పైకి లేవగానే నువ్వు నీ బ్యాగ్‌తోపాటూ తలుపు దగ్గరికి జంప్ అయిపోవాలి. ఒకవేళ కంపాస్ లేకపోతే నువ్వు పక్కన ఎవరైనా లేడీస్ మెడలో నుంచీ చెయిన్ లాగు. “దొంగా, దొంగా” అని పట్టుకొని వాళ్ళు నెక్స్ట్ స్టేషన్‌లో పోలీసులకి పట్టిస్తాము అని నిన్ను దింపుతారు. దింపగానే నువ్వు మన్మోహన్ సింగ్ బంధువు మూన్ మూన్ సింగ్ అని పోలీసులకి చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు.
నేను: అమ్మా ఈ క్లాసులు వింటూంటే మా ఊరికి నడిచి వెళ్ళిపోవటం బెటర్ అనిపిస్తోంది. (అని మనసులో అనుకుంటూ బిగ్గరగా ఏడవటం స్టార్ట్ చేసా.)
మళ్ళీ జె.జె గారు: అన్నట్టు మర్చిపోయా, ఎంట్రెన్స్‌లో ఇస్త్రీవాడు ఉంటాడు. జెనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కదా, నీ చేతులు పూర్తిగా చిరిగిపోయి ఉంటే 50 రుపీస్, కాళ్ళు కదలకపోతే 100 రుపీస్, నరాలు నలిగిపోతే 200 రుపీస్, గుండెకి గుండీ ఊడిపోతే 300 రుపీస్ చార్జ్ చేసి ఇస్త్రీ చేసి పంపిస్తాడు. ఫ్రెషర్‌కైతే ఇప్పుడు 5% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. విచ్చలవిడిగా వాడుకోవచ్చు.
నేను: సార్, ప్రాక్టికల్స్ ఒకసారి చూపిస్తారా? (జె.జె గారు కూడా పీ.ఎస్ గారిలాగా కళ్ళలోకి కంపాస్ పొడుచుకుంటారనే ఆశతో అడిగా).
జె.జె గారు “ఆ సరే” అనేసి నా మెడ మీద ఉన్న చెయిన్‌ని తీసుకొని 2 సెకండ్స్‌లో జంప్ అయిపోయారు. తిరిగి నాకు ఫోన్ చేసి “కంపాస్ మాత్రం నువ్వు పొడుచుకో, డౌట్స్ ఉంటే ఈ ఫోన్‌కి చెయ్యి” అని చెప్పి పెట్టేసారు.
నేను జె.జె గారికి రీడయల్ చేసి: సార్, కంపార్ట్‌మెంట్ నుంచీ దిగటానికి రెండో టిప్ చెబుతా అన్నారు. మరి అది చెప్పరా?
జె.జె గారు: “ఒకసారి రైలు దిగిన తరువాత మళ్ళీ మళ్ళీ రైలు దిగుతావా ఏంటీ? అయినా, టిప్ 1 ట్రై చెయ్యి. అది వర్కౌట్ కానప్పుడు చూద్దాంలే. ప్రతీ వెధవకీ మొత్తం సిలబస్ కవర్ చెయ్యటానికి మాది ఐ.తీ జాబ్స్ కాదు, రిసెషన్ వస్తే పీకెయ్యటానికి, కంప్లెయింట్ ఇస్తే టెర్మినేట్ చెయ్యటానికి. మాది పెర్మనెంట్ జాబ్, సొ ఇంతే చెబుతా…” అని మళ్ళీ నా మొహాన ఫోన్ పెట్టేసారు.ఇంథలో మా ఊరు వచ్చింది. ట్రైన్ నుంచి దిగి ఇంటికి వడి వడిగా అడుగులు వేసుకుంటూ చేఎరను.

వెళ్ళీ వెళ్ళగానే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి: “తాతయ్యకి ఏమైంది అమ్మమ్మ?” అని అడిగాను.

అమ్మమ్మ:  ఏమీ లేదురా.. మొన్న తెనాలికి ఏదో పని మీద వెళ్ళి తిరిగి నెల్లూరుకి జెనరల్ కంపార్ట్‌మెంట్ ఎక్కి వచ్చాడు. రాగానే, అక్కడ ఎవరో పరిచయం అయ్యారంట. అసలే రద్దీగా ఉంటుందని వాళ్ళకి 250 రుపీస్ ఇచ్చారంట రైల్ నుంచీ కిందకి దిగటానికి సహాయం చెయ్యమని. వాళ్ళేమో సహాయం చెయ్యకపోగా కళ్ళలో కంపాస్‌తో పొడిచారు. ఇప్పుడే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళకి బై-పాస్ సర్జరీ చెయ్యాలని చెప్పారు. దానికే నీకు ఫోన్ చేసాను. ఆ తరువాత మీ తాతయ్య ఏమో ఆ రైలు దిగమన్న ఆయనకి ఫోన్ చేస్తే ఏదో అరేబియన్ సముద్రంలో తోసేస్తా అని వార్నింగ్ ఇచ్చాడంట. వాడి సంగతి చూసే వరకు తాతయ్య ఇలా సీరియస్‌గా ఉంటాను. పచ్చి అరటికాయ కూడా తినను అని గోల చేస్తున్నారు… అనేసరికి మైండ్, బాడీ అండ్ సోల్ మొత్తం నాకు బ్లాక్ అయ్యాయి.

తాతయ్య వైపుకి తిరిగి “ఆయన పేరు ఏంటీ తాతయ్యా?” అని అడిగాను.

తాతయ్య: “అదేదో జంక్షనో ఫంక్షనో వస్తుంది” అనేసరికి ఈ పని మొత్తం జె.జె గారు చేసారని ఫిక్స్ అయ్యి, చేసేదేమీ లేక, చెయ్యగలిగింది కూడా ఏమీ లేక “అమ్మమ్మా గీసర్ ఆన్ చెయ్యి.. నీళ్ళు పోసుకొని ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒకరికి ఆపరేషన్ చేస్తే ఇంకొకరికి ఫ్రీ ఏమో కనుక్కోవాలి” అని చెబుతూ సోఫా మీద పడ్డాను.

 -   ట్రాన్స్‌లేటర్ పప్పూతో రాకేష్

 
అల్లావుద్దీన్ - ఆవకాయజాడీ

క్రియేటివ్ కిషోర్‌కి  ఇంటి వెనకాల మర్రి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అసలు తను ఇండస్ట్రీకి వస్తే రాజమౌళి రాజమండ్రిలో రోస్ మిల్క్ అమ్ముకొని బ్రతకాల్సిందేనని బాధపడ్డాడు. వి.వి.వినాయక్ వికారాబాద్‌లో వేరుశనగ వ్యాపారం చేస్తాడేమో అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు… వాళ్ళ గురించి బాధపడుతూనే హైదరాబాద్ రైలు ఎక్కేసాడు కిషోర్.   హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ప్రొడ్యూసర్‌ని వెతికే పనిలో పడ్డాడు. బషీర్‌బాగ్‌లో బాగా బలిసిన ప్రొడ్యూసర్ బాపిరాజు. అతను “దుప్పట్లో దండయాత్ర” అనే చిన్న పిల్లల సినిమా [...]

Oct 142012
 
మందు బాబులం

“హలో!!! పవన్ హియర్” “అరేయ్ మామా..  మన రాజేష్ గాడు యూ.ఎస్ ఎయిర్‌పోర్ట్ చూసి వచ్చాడని రాత్రికి పార్టీ చేసుకుంటున్నాం. ఆఫీసు నుండి త్వరగా వచ్చేయ్” అన్నాడు ఫోన్ లో కిషోర్. “యూ.ఎస్ ఎయిర్‌పోర్ట్ చూసి రావటం ఏంటిరా.. అందుకు మనం పార్టీ చేసుకోవటం ఏంటి?” అన్నాను. “పొరపాటున వీడిదనుకొని వాళ్ళావిడ పాస్‌పోర్ట్ తీసుకొని, యూ.ఎస్ దాకా వెళ్ళి, అక్కడ ఇమిగ్రేషన్‌లో పట్టుబడి, ఇండియాకి డిపోర్ట్ అయ్యి వచ్చాడట… అందుకని పార్టీ” అని వెకిలిగా నవ్వాడు కిషోర్. [...]

Sep 112012
 
తిట్ల దండకం - 1

కోపం అనేది అరిషడ్వర్గములలో ఒకటే అయినా, అది మన నీడ లా ఎప్పుడూ మన చెంతే ఉంటుంది. సాధువులకు ఇది వర్తించదు అని ఏమైనా అనుమానం వస్తే గనక, ఉత్తర క్షణం, మన దుర్వాసుణ్ణి గుర్తుతెచ్చుకోవలసింది గా మనవి. ఒకప్పుడు, అంటే.. సత్తెకాలం లో,  అప్రాచ్యపు వెధవా, పింజారీ వెధవా, కక్కకట్టడా అని మాత్రమే తిట్టేవారు. కానీ కాలం మారింది. సామెతలు కూడా రీమిక్స్ అయ్యే జెనెరేషన్ లో ఉన్నాము. తిట్లు కూడా పాత చింతకాయ పచ్చడి లానే [...]

Jul 022012
 
టెలీ-కాలర్స్

ఇన్నోసెంట్‌గా ఉన్నప్పుడు చూసిన మనీ సినిమా, ఇండీసెంట్‌గా తయారయిన తరువాత చూసిన గజిని సినిమా ఇన్స్‌పిరేషన్‌తో, నాకు ప్రపంచంలో ఉన్న ముగ్గురు శతృవుల పేర్లను మా ఇంటి బాత్‌రూం గోడ మీద పాండ్స్ పౌడరుతో రాసి, అది చెరిగిపోకుండా ఉండటానికి ఫెయిర్ అండ్ లవ్‌లీ క్రీం ని, అది పెద్దవ్వటానికి కొరమాండల్ యెరువులు, అలానే వారానికి ఒకసారి నాన్-వెజ్ కింద బల్లి గుడ్లు పెట్టి పెంచాను. కాలం గడిచే కొద్దీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి పర్సనల్ లోన్సు, అబ్దుల్ [...]

Jun 252012
 
“ఛీ”రియల్స్

శని, ఆదివారాలు మనకి కలిగించే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. స్కూలు లో ఉన్నప్పటినుంచి ఆఫీసు రోజులు దాకా శనివారం మధ్యాహ్నం, ఆదివారం అంటే అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంటుంది. సరే వీకెండు వచ్చింది కదా అని ఇంటికి పోయి వద్దామని సొంత ఊరు బయలుదేరాను. ఇంటికి చేరగానే మా అమ్మ నన్ను చూసి షాకుతో కూడిన ఆశ్చర్యం వల్లొచ్చిన పూనకంలో “ఏం బిడ్డా.. ఇన్నాళ్ళకి గూడు గుర్తొచ్చిందా… ప్రతీ వారం వస్తావనుకున్నానే… ఇలా నన్ను [...]

Jun 132012
 
31st డిసెంబర్

31st డిసెంబర్, 2011 [అందరూ న్యూ ఇయర్ కోసం ఎదురుచూసే రోజు అండ్ ఇంకా ఎక్కువమంది శ్యాలరీస్ కోసం ఎదురుచూసే రోజు]. 8:38 PM [పబ్స్ లో అంతా, డీ.జే’స్ రెడీ అయిపోయారు, టీ.వీల్లో “మీ స్పందన ఏంటి?” అని అడిగే యాంకర్స్ విజృంభిస్తున్న టైం అది] చింగ్… అని సౌండ్ వచ్చింది. (చింగ్ అనేది అదేదో చైనా సాహస వీరుడి పేరు కాదు, నా మొబైల్‌లో మెస్సేజ్‌కి వచ్చే సౌండ్). మెస్సేజ్ వచ్చిందని మొబైల్ వైపుకి [...]

Jun 022012
 
మసాజ్ పార్లర్

“హౌ ఫార్ వీ ఆర్ విత్ టుడే‘స్ డెలివరబుల్స్???” అన్నాడు నా మేనేజర్. “ఎహే… చేస్తున్నా కనపడటం లేదా, కళ్ళు దొబ్బాయా?” అన్నా విసుగ్గా. క్యూబికల్ మొత్తం నిశ్శబ్దం.. ఏం మాట్లాడానో నాకే అర్ధం కాలేదు. భాష అర్ధం కాకపోయినా.. భావం అర్ధమైన నా మరాఠీ మేనేజర్, “పవన్ ఐ థింక్ యూ నీడ్ టు రిలాక్స్’ అన్నాడు. అదే రోజు, వేళ్ళతో మాత్రమే టైప్ చేస్తే టైం సరిపోదేమో అని మోచేతులతో కూడా కీబోర్డ్ మీద [...]

 
ఆన్‌సైట్ రిటర్న్

సాఫ్ట్ వేర్  ఇండస్ట్రీలో ఏ పదం అంటే ఇంజనీర్ల మనసుల్లో ఆనందం రేకెత్తుతుందో.. ఏ ధ్వని వింటే ఉద్యోగుల ఒంట్లో తెలియని ఎక్సైట్‌మెంట్ ఉప్పొంగుతుందో ఆ ఛాన్స్ పేరే “ఆన్‌సైట్”. కాలేజ్ నుంచి డాలర్ డ్రీంస్‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం పరితపించే ప్రతీ విద్యార్థి, విద్యార్థినిలు కళ్ళలో మిణుగురు పురుగులని ఒత్తులుగా వేసుకొని ఎటువంటి ఆన్‌సైట్ ట్రిప్ అయినా పర్లేదు అని అనుకొని వెయిట్ చేస్తుంటారు. అటువంటి ఆన్‌సైట్ ఫారిన్ ఛాన్సుల కోసం కుస్తీ పడడం [...]

 
అమీరులను చేసే అమీర్ పేట్

చూస్తుండగానే ఇంజనీరింగ్ నాలుగేళ్లు హ్యాపీడేస్ సినిమాలా అయిపోయాయి. U.S వెళ్ళాలి అని ఇంగ్లీష్ మీద కసరత్తు పట్టి GRE రాసాను. పరదేశీయానానికి రంగం సిద్ధంగా ఉన్నపుడు, నా బ్రతుకులో యముడిలా OSAMA BIN LADEN తగలడ్డాడు. ట్విన్ టవర్స్‌ని విమానంతో కూల్చి,USవెళ్దామన్న నా ఆశాసౌధాన్ని కూడా అమాంతంగా కూల్చేసాడు.  “ఇండియాలో ఉండటంకన్నా మించిన ఆనందం ఇంకోటి ఉండదు” అని అందరికీ లెక్చర్ ఇచ్చి, CAT, MAT, RAT, BAT లాంటి రిథమిక్‌గా ఉన్న అన్ని M.B.A ఎగ్జామ్స్ [...]

© 2012 గోళీసోడా